Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధ‌నుష్ హాలీవుడ్ చిత్రం ఫ‌స్ట్‌లుక్ ఇదే!

  • 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంతో రంగప్ర‌వేశం
  • చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్న త‌మిళ న‌టుడు
  • భార‌త్‌, యూర‌ప్‌, హాలీవుడ్‌ను ఏకం చేసే సినిమా
భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆక‌ట్టుకుంటూనే హాలీవుడ్‌లో చిత్రాలు చేస్తున్న న‌టులు చాలా మందే ఉన్నారు. అనిల్ క‌పూర్‌, అనుప‌మ్ ఖేర్‌, ఇర్ఫాన్ ఖాన్ వంటి న‌టులంద‌రూ హాలీవుడ్‌లో స‌హాయ పాత్ర‌ల్లో న‌టించారు. కానీ త‌మిళ న‌టుడు ధ‌నుష్ మాత్రం త‌న మొద‌టి హాలీవుడ్ చిత్రం ద్వారానే హీరోగా ప‌రిచ‌యం కాబోతున్నారు. 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్‌' చిత్రంలో ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ మంగ‌ళ‌వారం విడుద‌లైంది.

త‌ల్లి చ‌నిపోయాక తండ్రి కోసం వెతుకుతూ దేశాలు తిరిగే ఫ‌కీర్ పాత్ర‌లో ధ‌నుష్ క‌నిపించ‌నున్నాడు. రొమైన్ ప్యూర్తొలా రాసిన 'ద ఎక్స్‌ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ద‌ ఫ‌కీర్ హూ గాట్ ట్రాప్‌డ్ ఇన్ యాన్ ఐకియా వార్డ్‌రోబ్‌' పుస్త‌కం ఆధారంగా ద‌ర్శ‌కుడు కెన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబై, బ్రుస్సెల్స్ (బెల్జియం), రోమ్ (ఇట‌లీ), పారిస్ (ఫ్రాన్స్‌) ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ చేశారు. ఇందులో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు కూడా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన‌వారు కావ‌డంతో చాలా వైవిధ్య‌త క‌నిపిస్తుంద‌ని కెన్ తెలిపారు. ముఖ్యంగా భార‌త్‌, యూర‌ప్‌, హాలీవుడ్‌ల‌ను ఏకం చేసే సినిమాగా ఇది నిలుస్తుంద‌ని అన్నారు.
dhanush
hollywood
debut
the extraordinary journey of the fakir
ken
europe

More Telugu News